పెంచిన బస్సు ఛార్జీలు సామాన్యుడికి పెనుభారంగా మారుతోందని, వెంటనే చార్జీలు తగ్గించాలని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ముందు ప్రయాణికులు ధర్నా చేపట్టారు. పల్లె వెలుగు బస్సులు నడుపుతూ.. స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ వేళ ప్రయాణికులను దోచుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.