రామగుండం: సామాజిక సేవకులకు ఉచిత వైద్య శిబిరం

53చూసినవారు
రామగుండం: సామాజిక సేవకులకు ఉచిత వైద్య శిబిరం
సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల ఆరోగ్యంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రామగుండం బ్రాంచ్, సిగ్మా హాస్పటల్ సంయుక్త సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిత్యం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు బీపీ, షుగర్, గుండె సంబంధిత వాటిపై వైద్య పరీక్షలను నిర్వహించారు.