ఏపీ, తెలంగాణలో MLC ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటలతో ముగిసింది. తెలంగాణలో MDK-NZB-ADB-KNR పట్టభద్రులు, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి, APలో ఉమ్మడి గుంటూరు- కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. మార్చి 3న కౌంటింగ్ జరగనుంది.