బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాళ ఏపీలో వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.