AP: అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందారు. కళాశాల వసతిగృహంలో ఉరేసుకున్నట్లు యాజమాన్యం చెబుతోంది. విద్యార్థిని మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.