కొత్త సంవత్సరంలో ఉద్యోగాల వెల్లువ: మంత్రి సత్యకుమార్

81చూసినవారు
కొత్త సంవత్సరంలో ఉద్యోగాల వెల్లువ: మంత్రి సత్యకుమార్
AP: కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం ఖాయమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బూడిద కుప్పల నుంచి ప్రాణం పోసుకునే ఫీనిక్స్ పక్షిలా అమరావతి మళ్లీ ఉదయిస్తోందన్నారు. ఈ క్రమంలో 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2025కు స్వాగతం పలికారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్