నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ప్రవీణా రాయ్ తన ఉద్యోగానికి గురువారం రాజీనామా చేశారు. ఆ వెంటనే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (MCX) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా బాధ్యతలు చేపట్టారు. ప్రవీణా నియామకానికి సెబీ గత ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. ఆమెకు ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది.