మిరప పంట కోత తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు

54చూసినవారు
మిరప పంట కోత తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు
సుగంధ ద్రవ్యాల పంటలన్నిటిలో ఉత్పత్తి, ఎగుమతుల్లో మిరప పంట ప్రథమ స్థానంలో ఉంది. 2023–24 సంవత్సరంలో దేశంలో సుమారు 2.59 మిలియన్ టన్నుల ఎండు మిరపకాయలను ఉత్పత్తి చేశారు. అయితే మిరప పంట కోత తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం... కోతలకు కనీసం ఇరవై రోజుల ముందు సస్యరక్షణ మందులు పిచికారి చేయకూడదు. పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోయాలి. కళ్లాంలో పోసిన వెంటనే ఆరబెట్టకుండా కనీసం రెండు రోజులు నీడలో రాసిగా పోయాలి.

ట్యాగ్స్ :