TG: తన హృదయంలో ఈ దేశానికి చాలా ప్రాధాన్యత ఉందని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా అన్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఇవాళ మాట్లాడారు. భారత సంస్కృతి, కళలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ స్ఫూర్తి లభిస్తోందని, విలువలు బోధిస్తారని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం ఎంతో గొప్ప భావన అని పేర్కొన్నారు.