క్రిస్మస్ ఈవ్ సందర్భంగా తెలంగాణలోని కొన్ని స్కూళ్లకు నేడు (మంగళవారం) ఆప్షనల్ హాలిడే ఉండనుంది. ఇప్పటికే ఆయా పాఠశాలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందింది. 25, 26న పబ్లిక్ హాలిడే ఉండటంతో ఆయా పాఠశాలలకు వరుసగా 3 రోజులు, మిగతా వాటికి 2 రోజులు సెలవులు ఉంటాయి. అటు ఏపీలోనూ ఇవాళ కొన్ని స్కూళ్లకు ఆప్షనల్, 25న పబ్లిక్ హాలిడే, 26న మళ్లీ ఆప్షనల్ హాలిడే ఉండనుంది.