దేశంలో 100 కోట్లకు చేరువలో ఓటర్లు
భారత్లో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరువైంది. ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా 96.88 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18-29 ఏళ్ల మధ్య వయసున్న యువత ఉన్నారు.