చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు నేలకూలాయి. ప్రస్తుతం కొద్ది రోజులు నిర్మాణాల కూల్చివేతకు గ్యాప్ తీసుకున్న హైడ్రా మళ్లీ విజృంభించేందుకు సిద్ధమైంది. జలవిహార్ను కూల్చి వేయాలంటూ గురువారం హైడ్రాకు సీపీఐ జాతీయ నేత, మాజీ ఎంపీ అజీజ్ పాషా ఫిర్యాదు చేశారు.