ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జబల్పూర్ జిల్లాకేంద్రంలో గురువారం తెల్లవారుజామున రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే మృతిచెందగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.