టాలీవుడ్ అగ్రహీరో వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పాజిటివ్ టాక్ రావడంతో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.77 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. అతి త్వరలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా మూవీలో వెంకీ కామెడీ ట్రాక్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుండటంతో థియేటర్లకు తరలివస్తున్నారు.