భోగి పండుగ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
భోగి పర్వదినాన లక్ష్మీదేవిని మోదుగ పూవులతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో మోదుగ పూల మొక్కను నాటితే దారిద్య్రం పోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి పూజించేటప్పుడు కొబ్బరి కాయ సమర్పించాలి. ఇలా చేసిన వారి ఇంట్లో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. పుష్య పూర్ణిమ సందర్భంగా ఇవాళ లక్ష్మీదేవికి సమర్పించిన కొబ్బరికాయను తర్వాత రోజు డబ్బు స్థానంలో ఉంచాలి. ఇలా చేస్తే శుభం కలుగుతుంది.