ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బి.ఎడ్ పాసైన యువతులు సోమవారం రోడ్డుపై వినూత్న నిరసన చేశారు. నడిరోడ్డుపై పడుకుని అక్కడి ప్రభుత్వానికి మొక్కుతూ ధర్నా చేపట్టారు. ఉద్యోగం మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నిరసన తెలిపిన బాలికల హృదయ విదారకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.