వారికి రూ.లక్ష: హోమంత్రి అనిత
AP: విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు అందించే తక్షణ సాయాన్ని కూటమి ప్రభుత్వం మూడు రెట్లు పెంచింది. వారి అంతిమ సంస్కారాల కోసం అందించే రూ.25 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ/ఆకస్మికంగా/అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఇది వర్తిస్తుందని హోంమంత్రి అనిత ఎక్స్‌లో వెల్లడించారు.