అద్భుతం.. మహాభారతంలో ప్రస్తావించిన 'తక్షక నాగు' ప్రత్యక్షం (వీడియో)

50చూసినవారు
తక్షకుడనే పాము ఆనాడు భారతదేశాన్ని పారిపాలించిన పరీక్షిత్తును కాటేసినట్లు మహాభారతంలో చదువుకొని ఉంటాం. అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము ఝార్ఖండ్‌ లోని రాంచీలో ప్రత్యక్షమైంది. ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చిన ఆ పామును చూసి అధికారులు భయంతో వణికిపోయారు. మామూలు పాములకు భిన్నంగా ఉన్న ఆ సర్పాన్ని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు ఎక్కువగా చెట్లపైనే నివసిస్తూ ఉంటుంది.

సంబంధిత పోస్ట్