AP: అధికారం అండతో గన్ను పెట్టి ఆస్తులు రాయించుకోవడం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవు. కొత్త తరహా నేరాల పట్ల చర్యలపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ముంబైలో మాఫియా బృందాలు లాక్కునే ఆస్తులను సీజ్ చేసే చట్టం ఉంది. ఆ విషయంపై సమాచారం తెప్పించుకుంటాం. చర్యలు తీసుకుంటాం.’ అని అన్నారు.