తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా
AP: ‘తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఎస్పీ అందరూ బాధ్యత వహించాలి’ అని వైసీపీ నేత రోజా అన్నారు. ‘సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కి సంబంధం లేకుండా 105BNS సెక్షన్ కింద కేసు పెట్టారు. తిరుపతికి ఏటా లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా వాళ్ల కోసం ఏర్పాట్లు చేయలేదు ఎందుకు?’ అని ప్రశ్నించారు. FIRలో సెక్షన్ 105BNS పెట్టకుండా సెక్షన్ 194BNS పెట్టి ప్రమాదవశాత్తూ జరిగిందని చేతులు దులిపేసుకున్నారన్నారు.