AP: సీఎం చంద్రబాబు అమరావతి నుంచి తిరుపతికి బయల్దేరారు. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలు, క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. తిరుపతి వెళ్లే ముందు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఘటన అనంతర పరిణామాలు, చేపట్టిన చర్యలపై చర్చించారు. మరోవైపు తిరుపతి జిల్లా కలెక్టర్ పంపిన ప్రాథమిక నివేదికపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.