కష్టపడి సంపాదించుకున్న తెలంగాణలో రేవంత్రెడ్డి రాబందులా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో శుక్రవారం 16 మందితో ఆయన ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. 'గతంలో రేవంత్ ఫార్మా కంపెనీలను విమర్శించారు. ఇప్పుడు వేల ఎకరాలు కావాలంటున్నారు. కులగణనలో పాల్గొన్న వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేశారు. తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు' అని ఫైర్ అయ్యారు.