అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌కు పీహెచ్డీ ఇవ్వాలి: హరీశ్ రావు

65చూసినవారు
అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌కు పీహెచ్డీ ఇవ్వాలి: హరీశ్ రావు
అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి పీహెచ్డీ ఇవ్వాలంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ.. 'తెలంగాణ సీఎం అబద్దాలు చెప్పినా ఆరు గ్యారంటీల మోసాన్ని గ్రహించిన మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి, దేవుళ్లపై ఒట్టు పెట్టి మరీ తెలంగాణ ప్రజలను రేవంత్ మోసం చేశారు. లగచర్లలో ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మారుస్తున్నారు' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్