ఉరకలేస్తోన్న గోదారి.. కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక

54చూసినవారు
ఉరకలేస్తోన్న గోదారి.. కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలేస్తోంది. దీంతో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. సోమవారం 26 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. మంగళవారం మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరో గంటలో 48 అడుగులకు చేరనుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్