బిహార్‌లోని నవాడా జిల్లాలో ఓ ముఠా కొత్త మోసానికి తెరలేపింది. సంతానం లేని స్త్రీలను గర్భవతి చేస్తే భారీ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని సోషల్ మీడియాలో ప్రకటించింది. గర్భవతిని చేస్తే రూ.10 లక్షలు, ప్రెగ్నెంట్ చేయడంలో విఫలమైనా రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు ఇస్తామని పలువురిని నమ్మించింది. ఆధార్, పాన్, ఫోటోలు తీసుకుని రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేసింది ఆ ముఠా. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.