మీ దగ్గర ఉన్న రూ. 500 నోటు నిజమైనదా? కాదా? అని ఎలా తెలుసుకోవాలంటే.. రూ. 500 నోటు మధ్యలో గాంధీ బొమ్మ ఉంటుంది. 'భారత్', 'ఇండియా' అనే రెండు పదాలు సూక్ష్మ అక్షరాల్లో ఉంటాయి. దేవనాగరిలో '500' అని రాసి ఉంటుంది. రంగు మారే సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. గాంధీ బొమ్మకు కుడివైపున వారంటీ, ప్రామిస్, గవర్నర్ సంతకం ఉంటాయి. కింది భాగంలో కుడివైపున '500' గుర్తు ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారుతుంది. కుడివైపున అశోక స్తంభం, ముద్రణ సంవత్సరం, 'స్వచ్ఛ్ భారత్' లోగో, నినాదం ఉంటాయి.