ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్వాలి ఫతేఘర్ ప్రాంతంలో ముగ్గురు స్నేహితులు రోడ్డు పక్కన కూర్చొని మాట్లాడుకుంటుండగా.. అతివేగంతో వచ్చిన కారు వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.