Oct 28, 2024, 07:10 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
కలెక్టరేట్ ముందు సిఐటీయూధర్నా
Oct 28, 2024, 07:10 IST
ఈఎస్ఐలో పనిచేసే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ సిఐటీయూఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ మూడు నెలలకు పైగా వేతనాలు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అనంతరం కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం సమర్పించారు.