మహారాష్ట్ర ఎన్నికల్లో మొదటిసారి తండ్రి కుమార్తెలు రాజకీయ ప్రత్యర్థులు అయ్యారు. అహేరి నియోజకవర్గంలో ఎన్‌సీపీ (అజిత్ పవార్) తరఫున తండ్రి ధర్మారావు బాబా ఆత్రమ్, ఎన్‌సీపీ (శరద్ పవార్) తరఫున కుమార్తె భాగ్యశ్రీ బరిలో నిలబడ్డారు. స్వయంగా తన పనులు చేసుకోలేని నేత ప్రజలకు ఏం చేస్తారంటూ భాగ్యశ్రీ తండ్రిపై విమర్శలు చేశారు. తన కూతురికి వంట రాదని, అల్లుడు నిత్యం జొమాటో నుంచి భోజనం తెప్పించుకుంటాడని ధర్మారావు ఎద్దేవా చేశారు.