Apr 12, 2025, 06:04 IST/
పాస్టర్ ప్రవీణ్ బైక్ను ఏ వాహనం ఢీకొనలేదు: ఐజీ
Apr 12, 2025, 06:04 IST
AP: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ కోణాలలో దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు. హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం దుకాణాలకు వెళ్లారు. దారిలో ఆయనకు 3 సార్లు ప్రమాదాలు జరిగింది. ప్రవీణ్ వెళ్తున్న బైక్ను ఏ వాహనం ఢీకొనలేదు.’ అని అన్నారు.