కస్తూర్బా లో 11 మంది బాలికలకు అస్వస్థత
న్యాల్కల్ లోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో 11 మంది విద్యార్థినిలు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో చదివే బాలికలకు దగ్గు ఎక్కువగా రావడంతో స్పందించిన సిబ్బంది వెంటనే 108 వాహనంలో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వేరు నుంచి రక్త నమోనాలను సేకరించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు.