త్రయంబకేశ్వర ఆలయంలో సహస్ర బిల్వార్చన పూజ
జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల పరిధిలోని తాటిపల్లి గ్రామంలో వెలసిన త్రయంబకేశ్వర ఆలయంలో సోమవారం సహస్ర బిల్వార్చన, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దంపతులు స్వామివారికి అభిషేకించి సహస్ర బిల్వ పూజ, వివిధ రకాల పూలతో అలంకరణ, పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కులమతాలకతీతంగా పాల్గొనడం జరిగింది.