సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడిగించాలని సిపిఎం పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ (ఏం ) పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఇస్నాపూర్ లో ప్రజల నుండి విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.