యాక్సిడెంట్.. పటాన్చెరు వాసులు మృతి
రేణిగుంట - కడప జాతీయ రహదారిలో కుక్కల దొడ్డి మామండూరు మధ్య ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో భార్యా భర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్చెరుకు చెందిన సందీప్ (45), అంజలీదేవి(40) తిరుమల శ్రీవారిని దర్శించుకుని సోమవారం హైదరాబాదుకు కారులో వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.