మంటల్లో కాలిపోతున్న కరెన్సీ నోట్లు (వైరల్ వీడియో)
దీపావళి పండుగ సందర్భంగా కరెన్సీ నోట్లను తగలబెడుతున్న వీడియో వైరల్ అవుతోంది. రూ.100, రూ.500 నోట్లు కాలిపోతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని సెకన్లలోనే పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు మంటల్లో ఓ వ్యక్తి తగులబెట్టాడు. ఈ వీడియో కుమార్ దినేష్ భాయ్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇది చూసిన నెటిజన్లు డబ్బులు అవసరం లేకుంటే నిరుపేదలకు పంచిపెట్టండని కామెంట్లు పెడుతున్నారు.