ఏపీలో స్టీల్ ప్లాంట్ కోసం రూ.1.40 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు AM/NS (ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్) సిద్ధంగా ఉందని టీడీపీ ట్వీట్ చేసింది. ఈ రెండు సంస్థలు జాయింట్ వెంచర్‌గా 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అనకాపల్లి జిల్లాలో ప్రారంభిస్తాయని పేర్కొంది. ఆర్సెలార్ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో మంత్రి లోకేశ్ జూమ్ కాల్లో మాట్లాడగా.. ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.