కోళ్లు పొద్దున్నే కూయడానికి కారణం ఇదే

70చూసినవారు
కోళ్లు పొద్దున్నే కూయడానికి కారణం ఇదే
కోళ్లు పొద్దున్నే ఎందుకు కూస్తాయో తెలుసా..? మనుషుల్లో ఉన్నట్లే కోళ్ల శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అంటారు. కోడి కళ్ళు సూర్యోదయం సమయంలో కాంతిలో మార్పును వెంటనే పట్టుకుంటాయి. అప్పడు గడియారానికి సంకేతం అందుతుంది. దీంతో కోళ్లు కూత పెడుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అయితే కోళ్లు తమ చుట్టూ ఉన్న వాటిని అలర్ట్ చేయడానికి కూడా ఇలా కూత పెడుతుంటాయని అంటున్నారు.

సంబంధిత పోస్ట్