పిఠాపురంలో చంద్రబాబు, పవన్‌కు అవమానం!
AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అవమానం ఎదురైంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలను అధికారులు ఏర్పాటు చేయలేదు. దాంతో అక్కడికి వచ్చిన టీడీపీ, జనసేన నాయకులు దీన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీరియస్ అయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలను అధికారులు పెట్టడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు.