రణపాల ఆకులతో కిడ్నీ సమస్యలకు చెక్
రణపాల ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రణపాల ఆకుల రసాన్ని పరగడుపున రెండు స్పూన్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. ఈ ఆకు రసాన్ని పావు స్పూను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి, ఆస్తమా తొందరగా తగ్గుతుంది. రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా డయాబెటిస్‌ని క్రమబద్దీకరిస్తుందని సూచిస్తున్నారు.