గతేడాది సెప్టెంబరులో వరుసగా 9 రోజుల పాటు ప్రపంచమంతా భూమి కంపించగా, దాని వెనకున్న మిస్టరీ వీడింది. గతేడాది గ్రీన్‌ల్యాండ్‌లోని ఓ పర్వతం వద్ద చాలా ఎత్తు నుంచి మంచు చరియలు విరిగిపడడంతో మెగా సునామీ సంభవించిందని, అది తొమ్మిది రోజుల పాటు ఒక ప్రాంతంలో ముందుకు వెనుకకు దూసుకుపోయిందని అధ్యయనకారులు వెల్లడించారు. దీనివల్లే 9 రోజుల పాటు భూమి కంపించిందని తెలిపారు. సునామీతో 110 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడ్డాయి.