ప్రియురాలితో బ్రేకప్.. విషం తాగిన యువకుడు (వీడియో)
యూపీలోని ఆగ్రాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తన ప్రియురాలితో బ్రేకప్ అయింది. దీంతో సదరు యువకుడు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్లాస్లో విషం తీసుకుని తాగుతున్న వీడియోను ఇన్స్టాలో షేర్ చేశాడు. ఈ వీడియో వెంటనే వైరల్ కావడంతో పోలీసులు స్పందించి యువకుడి ఇంటికి వచ్చి తలుపులు పగులగొట్టి ఆస్పత్రికి తరలించారు. అయితే యువకుడు విషపూరితమైన దోమల మందు తాగినట్లు తెలుస్తోంది.