ఆధార్ అప్‌డేట్ పేరుతో నయా మోసం (వీడియో)

1881చూసినవారు
ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలని చెప్పి నమ్మబలికి వృద్ధురాలి నుంచి బంగారం కొట్టేసిన ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. గోపవరం మండలం చిన్న గోపవరం గ్రామంలో రామలక్ష్మమ్మ అనే వృద్ధురాలి ఇంటికి ఇద్దరు కేటగాళ్లు వెళ్లారు. ఆధార్ అప్‌డేట్ కోసం వచ్చామని ఆమెను నమ్మబలికించారు. ఆధార్ అప్‌డేట్ కోసం ఫొటో తీయాలని, ఫొటోల్లో బంగారు ఆభరణాలు ఉండకూడదని చెప్పి ఆమె మెడలోని బంగారం తీయించారు. ఆ బంగారంతో అక్కడి నుంచి పరారయ్యారు.

సంబంధిత పోస్ట్