కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్
ప్రభాస్ ఫస్ట్ లుక్ లీ
క్ కావ కావడంపై మంచు విష్ణు సీరియస్ అయ్యారు. 'కన్నప్ప సినిమా గురించి గత 8 ఏళ్లుగా చాలా కష్టపడుతున్నాం. 2 ఏళ్ల నిబద్ధతతో ఈ సినిమాను పూర్తి చేయడానికి ఆహర్నిశలు శ్రమిస్తూ మా ప్రాణాలను పణంగా పెట్టాం. ఇలాంటి క్షణాల్లో కన్నప్ప సినిమా నుంచి ఒ
క ఇమేజ్ లీక్ అయినందుకు బాధపడుతున్నాం. ఫోటోను లీక్ చేసిన వారిని పట్టుకుంటే రూ.
5 లక్షలను బహుమానంగా ఇస్తాం' అని శనివారం ఓ నోట్‌ను విడుదల చేశారు.