పాల సేకరణ ధర పెంపు
AP: పాల సేకరణ ధరను పెంచాలని కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయించింది. 10 శాతం వెన్న కలిగిన లీటర్ గేదె పాలపై రూ.2, ఆవు పాలపై రూ.1.50 పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 10 శాతం వెన్న కలిగిన పాలను రూ.80 చెల్లిస్తున్నారు. యూనియన్‌లో ఉన్న పాడి రైతులకు 4 నెలలకు సంబంధించిన రెెండో విడత బోనస్‌గా రూ.12 కోట్లను మంగళవారం విడుదల చేయనుంది.