నేడు అసెంబ్లీలో రిషికొండ ప్యాలెస్‌పై చర్చ

83చూసినవారు
నేడు అసెంబ్లీలో రిషికొండ ప్యాలెస్‌పై చర్చ
AP: మాజీ సీఎం జగన్ హయాంలో రిషికొండలో నిర్మించిన ప్యాలెస్‌పై శాసనసభలో మంగళవారం స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ ప్యాలెస్ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే దానిపై పలువురు సభ్యులు ఇప్పటికే సభలో ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలన్న వారు కోరారు. ఈ మేరకు స్వల్పకాలిక చర్చకు సభాపతి అయ్యన్నపాత్రుడు అనుమతించారు.

సంబంధిత పోస్ట్