రాయపోల్: ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం గ్రామంలో గురువారం వాల్మీకి జయంతి పురస్కరించుకొని శ్రీ మహర్షి వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మహర్షి వాల్మీకి బోయ సంఘం అధ్యక్షులు సారా శ్రీధర్ (రాజు), ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సుదర్శన్, లక్ష్మీనారాయణ, నర్సింలు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.