వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేశామని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. మరో 57 మంది అదుపులో ఉన్నారని పేర్కొన్నారు. దర్యాప్తు చేసి మరికొందరిని అరెస్ట్ చేస్తామన్నారు. సురేశ్ అనే వ్యక్తి ఇందులో కీలకంగా వ్యవహరించాడని తెలిపారు. అతని కోసం బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రజాభిప్రాయ సేకరణలో గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని వివరించారు.