ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. వాళ్లందరిని స్మరించుకునే రోజు ఇదేనన్నారు. 40 కోట్ల మంది కలిసి స్వాతంత్య్రాన్ని సాధిస్తే.. 140 కోట్ల మంది ఏదైనా సాధించవచ్చని ప్రధాని తెలిపారు.