దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 82,129 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25,078 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ చివరికి 126 పాయింట్ల లాభపడి 81,867 వద్ద ముగిసింది. నిఫ్టీ 59.75 పాయింట్లు లాభపడి 25,010 పాయింట్ల వద్ద ముగిసింది. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, NTPC, HDFC బ్యాంక్, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 82.89గా ఉంది.