వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌లకు పంపారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా రాజ్యసభలో వైసీపీ మూడు స్థానాలను కోల్పోయింది. మరో రాజ్యసభ సభ్యుడు కూడా రాజీనామాకు దాదాపు సిద్ధమయ్యారని తెలిసింది.